వాడపల్లి నిత్యాన్నదాన భవన నిర్మాణానికి విరాళం

వాడపల్లి నిత్యాన్నదాన భవన నిర్మాణానికి విరాళం

కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లిలో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో నూతనంగా నిర్మిస్తున్న వకుళమాత అన్నదానం భవన నిర్మాణానికి ఆదివారం భైరవపట్నం వాస్తవ్యులు గాదిరాజు నారాయణరాజు, అరుణ దంపతులు రూ. 1,01,116 రూపాయల విరాళాన్ని అందజేశారు. అనంతరం ఆలయ సిబ్బంది దాతలకు స్వామివారి చిత్ర పటాన్ని అందజేశారు.