అనాథ యువతి వివాహానికి రూ.50వేల ఆర్థిక సహాయం
NLG: దేవరకొండ మండలం పర్శతండాకు చెందిన నేనావత్ సోని అనే యువతి వివాహానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కిషన్ నాయక్ అండగా నిలిచారు. తల్లిదండ్రులు లేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సోని పరిస్థితిని తెలుసుకున్న ఆయన, ఆమె వివాహానికి తన వంతు సహాయంగా శనివారం రూ.50 వేల నగదుతో పాటు, పట్టుచీరను కానుకగా అందజశారు. తల్లిదండ్రులు లేని పిల్లలను ఆదుకోవడం మనందరి బాధ్యత అన్నారు.