మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కెళ్లిన దుండగులు
TPT: నాయుడుపేట మండలం శ్రీరామ్ నగర్‌లో పట్టపగలు దుండగులు మహిళ మెడలోని నాలుగు సవర్ల బంగారు సరుడును అపహరించి పరారయ్యారు. గిరిజమ్మ అనే మహిళ ఇంటి ముందు ఉన్న సమాయంలో మోటార్ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు వాటర్ ప్యాకెట్లు, చాక్లెట్లు అడిగి మాయచేశారు. అనంతరం ఒక్కసారిగా మెడలో ఉన్న గొలుసు లాక్కొని వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.