పుట్టపర్తిలో ట్రాఫిక్‌ ఆంక్షలు

పుట్టపర్తిలో ట్రాఫిక్‌ ఆంక్షలు

సత్యసాయి: పుట్టపర్తిలో నేడు, రేపు VIPల పర్యటనల దృష్ట్యా భద్రతను కట్టుదిట్టం చేశారు. సత్యమ్మ గుడి, యనుములపల్లి సర్కిల్ వరకు రోడ్లపై ద్విచక్ర వాహనాలు నిలిపితే, క్రేన్ల సహాయంతో తీసివేస్తామని అధికారులు హెచ్చరించారు. రోడ్లపై వాహనాలు నిలిపిన వారికి రూ. 2,000 పైన జరిమానా విధించే అవకాశం ఉంది. భక్తులు, ప్రజలు ముందస్తుగా రోడ్లపై వాహనాలు నిలపవద్దని పోలీసులు సూచించారు.