మృతదేహానికి నివాళులర్పించిన హిందూపురం మాజీ ఎంపీ

మృతదేహానికి నివాళులర్పించిన హిందూపురం మాజీ ఎంపీ

సత్యసాయి: నల్లమాడ మండలం టీడీపీ మండల మాజీ కన్వీనర్ ఎర్రవంకపల్లికి చెందిన లక్ష్మీనారాయణ మంగళవారం మరణించారు. విషయం తెలసుకున్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, హిందూపురం మాజీ ఎంపీ నిమ్మలకిష్టప్ప ఆయన గ్రామానికి వెళ్లి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. లక్ష్మీనారాయణ మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.