'నియోజకవర్గంలో 45 వేల మంది రైతులకు లబ్ది'

VZM: పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఎస్. కోట నియోజకవర్గంలో 45 వేల మంది రైతులకు రూ. 27.50 కోట్లు నిధులు విడుదల చేసినట్లు ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. ఇవాళ లక్కవరాపు కోట ఎంపీడీవో ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతన్నల అభ్యున్నతి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.