VIDEO: జాతీయ ఓటర్ల దినోత్సవం అవగాహన ర్యాలీ
వరంగల్ జిల్లా కేంద్రంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం బల్డియా నుంచి ఐఎంఏ హాల్ వరకు అవగాహన ర్యాలీని అధికారులు నిర్వహించారు. బల్డియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు, బీఎల్‌వోలు, ఆర్‌పీలు, తదితరులు పాల్గొన్నారు.