'వెల్లువిరిసిన మతసామరస్యం'
MHBD: కొత్తగూడ మండలంలో మతసామరస్యం వెల్లువిరిసింది. మండల కేంద్రానికి చెందిన జర్నలిస్టు సల్మాన్ అయ్యప్ప స్వామి భక్తులకు బుధవారం భిక్ష ఏర్పాటుచేశారు. గత నాలుగేళ్లుగా ప్రతి కార్తీక పౌర్ణమి నాడు తాను అయ్యప్ప భక్తులకు బిక్ష పెడుతున్నానని, మతం అనేది మనిషిని విడదీయడం కోసం కాదు, ప్రేమతో కలిపి ఉంచడం కోసం అని ఆయన తెలిపారు.