నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 19 వరకు సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలు మొత్తం 19 రోజుల పాటు కొనసాగుతాయి. ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టే అవకాశముంది. ప్రతిపాదిత అణుశక్తి బిల్లు, ఉన్నత విద్యా కమిషన్ బిల్లు, మణిపూర్ వస్తువులు, సేవల పన్ను బిల్లులు ఈ జాబితాలో ఉన్నాయి.