వర్షాలపై ఆరా తీసిన పలాస ఎమ్మెల్యే

వర్షాలపై ఆరా తీసిన పలాస ఎమ్మెల్యే

SKLM: అల్పపీడన ప్రభావంతో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలపై పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మంగళవారం ఆరా తీశారు. నియోజకవర్గంలో ఏదైనా సమస్యలు తలెత్తాయా? రైతులకు ఏమైనా నష్టం సంభవించిందా..? విద్యుత్ స్తంభాలు, పశువులకు గాని ఎటువంటి నష్టం జరిగిందా అనే విషయంను అధికారులతో ఫోన్ ద్వారా మాట్లడారు. ఎటువంటి నష్టం జరిగిన వెంట వెంటనే పరిష్కారం దిశగా చర్యలు చేపడతానన్నారు.