'కార్పొరేషన్ పరిధిలోని సమస్యలు పరిష్కరించాలి'

ELR: ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న సమస్యలను తక్షణం పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రవి డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ప్రజాపోరు యాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. నగరంలోని గ్రీన్ సిటీ, శ్రీనివాస్ నగర్, సుందరయ్య కాలనీ, కొత్తూరు ఇందిరమ్మ కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలని కోరారు.