హై స్కూల్ మూసివేతపై ఆగ్రహం
PLD: ఎడ్లపాడు లూథరన్ హై స్కూల్ మూసివేతపై పాఠశాల అభివృద్ధి కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏఈఎల్సీ సంస్థ నిర్లక్ష్యమే ఈ దుస్థితికి కారణమని పేర్కొంది. గురువారం జరిగిన సమావేశానికి పూర్వ విద్యార్థులు, గ్రామ పెద్దలు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పాఠశాల 70 ఏళ్ల చరిత్ర, దాతల సేవలు, ప్రస్తుత పరిస్థితులపై విపులంగా చర్చించారు.