సంజూ కంటే అతడే బెటర్: సూర్య కుమార్
సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్ నేపథ్యంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 'ఓపెనింగ్ స్థానానికి సంజూ శాంసన్ కంటే శుభ్‌మన్ గిల్ బెటర్. ఈ సిరీస్‌లోనూ బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రయోగాలు జరుగుతాయి. మా జట్టులో ఏ స్థానంలోనైనా రాణించగలిగే ప్రతిభావంతులు ఉన్నారు. దీంతో తుది జట్టు ఎంపిక తలనొప్పిగా మారింది' అని పేర్కొన్నాడు.