విద్యార్థినిని అభినందించిన అదనపు కలెక్టర్

NRML: హైదరాబాదులోని హకీంపేట స్పోర్ట్స్ పాఠశాలలో 4వ తరగతి ప్రవేశం కోసం రాష్ట్రస్థాయిలో నిర్వహించిన పోటీలలో జిల్లాకు చెందిన నికిత అనే విద్యార్థిని ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు ఎంపిక అయింది. ఈ సందర్భంగా బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ విద్యార్థినిని శాలువాతో ఘనంగా సన్మానించారు.