ALERT: నేడే చివరి అవకాశం

ఐటీ రిటర్న్స్ దాఖలు గడువును ఆదాయపు పన్ను విభాగం మరో రోజు పొడిగించింది. సాంకేతిక సమస్యల కారణంగా యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులపై స్పందిస్తూ, గడువును ఇవాళ్టి వరకు పొడిగించింది. అసెస్‌మెంట్ ఇయర్ 2025-26కి సంబంధించి ఐటీఆర్ దాఖలు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 15 కాగా, ఇప్పుడు అది ఇవాళ్టికి మారింది. కాగా, సెప్టెంబర్ 15 వరకు 7.3 కోట్లకు పైగా ఐటీఆర్ ఫైలింగ్‌లు జరిగాయి.