VIDEO: YSR ఉల్లిమెల్లలో సందడి చేసిన విద్యార్థులు..!
KDP: పులివెందుల పట్టణంలోని డాక్టర్ YSR ఉల్లిమెల్ల లేక్ ఫ్రంట్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శిల్పారామం పరిపాలన అధికారి విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు జానపద, శాస్త్రీయ, భక్తి గీతాలకు అద్భుతమైన నృత్యాలు ప్రదర్శించారు. విద్యార్థుల ప్రతిభకు ప్రేక్షకులు ఈలలు, చప్పట్లతో అభినందనలు తెలిపారు.