అఖిలప్రియది హీరోయిజం కాదు: జగన్మోహన్ రెడ్డి

NDL: అఖిలప్రియది హీరోయిజం కాదని నంద్యాల విజయ డెయిరీ ఛైర్మన్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆళ్లగడ్డ MLA అఖిలప్రియ మంగళవారం నంద్యాల విజయ డెయిరీని సందర్శించి డెయిరీ ఛైర్మన్‌పై విమర్శలు గుప్పిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అఖిలప్రియ చేసినవన్నీ అసంబద్ధ ఆరోపణలు అని, నిజనిజాలు తెలసుకొని మాట్లాడాలని ఆయన బుధవారం మీడియాతో అన్నారు.