తంగళ్ళపల్లిలో ఎరువుల షాప్‌పై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
SRCL: తంగళ్ళపల్లిలోని గ్రోమోర్ ఎరువుల షాపును ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫెర్టిలైజర్ యాప్ ద్వారా బుకింగ్‌లు, స్టాక్ వివరాలు పరిశీలించారు. జిల్లాలో ఈనెల 1 నుంచి 92,735 యూరియా సంచులు రాగా, 84,068 మంది రైతులు బుక్ చేసుకున్నారు. 79,948 మంది కొనుగోలు చేశారు. 11,694 సంచులు నిల్వ ఉన్నాయని, కొరత లేదని తెలిపారు.