హాకీ ఫైనల్ ప్రారంభించిన కలెక్టర్
CTR: క్రీడల్లో రాణించడం ద్వారా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని కలెక్టర్ సుమిత్ కుమార్ చెప్పారు. చిత్తూరులో జరుగుతున్న 16వ హాకీ ఆంధ్రప్రదేశ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ బాలికల హాకీ చాంపియన్ షిప్ -2026 పోటీల్లో భాగంగా శనివారం సత్యసాయి, అనంతపురం జిల్లాల మధ్య ఫైనల్ పోటీలను ఎస్పీ తుషార్ డూడీతో కలిసి ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.