VIDEO: వరద బాధితులకు ముస్లిం కమ్యూనిటీ చేయూత

NZB: పంజాబ్ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని లచ్ఛపేట్ ముస్లిం కమ్యూనిటీ ప్రతినిధి అస్లాం కోరారు. శనివారం గ్రామ ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో పంజాబ్ వరద బాధితుల సహాయార్థం రూ. 20 వేల నగదును పంపించారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ యూసుఫ్, మస్తాన్ అలీ, తదితరులు పాల్గొన్నారు.