VIDEO : ఘనంగా ఎల్లమ్మ బోనాలు
JGL: జగిత్యాల పట్టణంలోని పోచమ్మ వాడలో బుధవారం ఎల్లమ్మ తల్లికి బోనాలు నిర్వహించారు. ఎల్లమ్మ పట్నాలు కార్యక్రమంలో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కురుమ సంఘం ఆధ్వర్యంలో మహిళలు ఇంటికో బోనంతో తరలి వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. కురుమ సంఘం నాయకులు పాల్గొన్నారు.