భోనమెత్తిన బాచుపల్లి.. తరలివచ్చిన ప్రజాప్రతినిధులు

మేడ్చల్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి గ్రామంలోని నల్లపోచమ్మ దేవాలయం(ఏడు గుళ్ల)లో భోనాల పండుగ జరిగింది. ఆహ్వానం మేరకు భోనాల పండుగ ప్రత్యేక పూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నల్లపోచమ్మ దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలన్నారు.