ఆగస్టు 19న పెసా ఎన్నికలపై శిక్షణ

ASR: చింతపల్లి మండలంలో పెసా ఎన్నికలు నిర్వహించేందుకు ఆగస్టు 19న ప్రీసైడింగ్ అధికారులు, పీవోలకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశామని ఎంపీడీవో సీతామహాలక్ష్మి తెలిపారు. ఈనెల 29లోగా గ్రామసభలు నిర్వహించి పెసా కమిటీల ఉపాధ్యక్షులు, కార్యదర్శులకు ఎన్నిక నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహిస్తున్న శిక్షణకు అధికారులు హాజరు కావాలన్నారు.