ఉద్యోగాల హబ్‌గా జేవార్ నోయిడా విమానాశ్రయం

ఉద్యోగాల హబ్‌గా జేవార్ నోయిడా విమానాశ్రయం

నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం దేశానికి ఆర్థిక వృద్ధి కేంద్రంగా మారుతుందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. జేవార్‌లో ఈ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించగా, ఇది యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పిస్తుందన్నారు. సుమారు రూ.11,200 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు, అంతర్జాతీయ స్థాయిలో రవాణా విమానయాన రంగాన్ని కొత్త శిఖరాలకు చేరుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.