MJP గురుకుల పాఠశాలలో కంటి పరీక్షలు

NRPT: లయన్స్ క్లబ్ మక్తల్ భీమా ఆధ్వర్యంలో పట్టణంలోని జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో శనివారం విద్యార్థులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సత్యాంజనేయులు సహకారంతో జరిగిన ఈ శిబిరంలో కంటి సమస్యలు ఉన్న విద్యార్థులకు ఉచితంగా మందులు అందించారు. కంటి ఆరోగ్యం కోసం పోషకాహారం తీసుకోవాలని వైద్యులు విద్యార్థులకు సూచించారు.