'రైతులు నేల ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించాలి'

PDPL: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతులు నేల ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించాలని మంథని ఏడీఏ అంజని మిశ్రా తెలిపారు. సంప్రదాయ యూరియా బస్తా బదులు అర లీటర్ నానో యూరియానే సమాన ఫలితాలు ఇస్తుందని, కలెక్టర్ శ్రద్ధతో ఇది రైతులకు కేవలం రూ. 150కే అందుబాటులో ఉందని చెప్పారు. నానో యూరియా వాడకం ద్వారా నిల్వ, రవాణా ఖర్చులు తగ్గి దిగుబడి పెరుగుతుందన్నారు.