'క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం'

'క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం'

నల్గొండ: క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి దోహదపడతాయని ఎంజీ యూనివర్శిటీ ప్రొఫెసర్ అంజిరెడ్డి అన్నారు. నల్గొండ కేంద్రీయ విద్యాలయంలో బుధవారం వార్షిక ఆటల పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు మాట్లాడుతూ.. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో రవికుమార్, ఉత్కర్ష్, సందీప్, నెహ్రా పాల్గొన్నారు.