చిన్నారి ప్రాణాలు తీసిన ఆడుకునే బెలూన్

చిన్నారి ప్రాణాలు తీసిన ఆడుకునే బెలూన్

గుంటూరు జిల్లాలో ఆడుకునే బెలూన్ ఓ నాలుగేళ్ల చిన్నారి గొంతుకు అడ్డుపడి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన ఘటన బుధవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. బెలూన్‌తో శిరీష ఆడుకుంటుండగా, బెలూన్ గొంతుకు అడ్డుపడి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గుంటూరు జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. అప్పటికే చిన్నారి ప్రాణాలు విడిచినట్లు వైద్యులు వెల్లడించారు.