VIDEO: ఆ రోడ్లో కేజీ వీల్స్‌తో ట్రాక్టర్ నడపడం నిషేధం
NLR: విడవలూరు మండలంలోని వావిళ్ళ నుంచి విడవలూరు పట్టణం వరకు ఇటీవల తారు రోడ్డు వేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఏపీ పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. కేజీ వీల్స్‌తో ట్రాక్టర్ నడిపితే దాదాపుగా రూ. 5 వేల జరిమానా, ఆరు నెలలు జైలు శిక్ష ఉంటుందన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలన్నారు.