భారీగా ఎర్రచందనం దుంగలు స్వాధీనం

భారీగా ఎర్రచందనం దుంగలు స్వాధీనం

నెల్లూరు: కావలి వద్ద పోలీసులు భారీగా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 2.5 టన్నుల బరువు, రూ. 2 కోట్ల విలువైన ఈ దుంగలను అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో, ఎర్రచందనం స్మగ్లర్లు పోలీసులపైకి దూసుకువచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.