VIDEO: భారీ వర్షం.. నీట మునిగిన రహదారులు

SKLM: నరసన్నపేటలో వాతావరణ మార్పులతో భారీ వర్షం కురుస్తుంది. శుక్రవారం ఉదయం నుండి ఒక మోస్తరుగా ప్రారంభమైన చినుకులు మధ్యాహ్నానికి భారీ వర్షంగా మారింది. దీంతో పలు ప్రాంతాలలో వర్షపు నీరు చేరి రహదారులు జలమయమయ్యాయి. మురుగు కాలువలు మూసుకుపోవడంతో ఈ పరిస్థితి ఎదురవుతుంది. ఈ వర్షం మాత్రం వ్యవసాయానికి ఎంతో ప్రయోజనం అని స్థానికులు తెలిపారు.