ఉపాధి హామీ పనుల్లో నిర్లక్ష్యం వద్దు: ZP CEO
SRPT: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిర్వహణలో అధికారులు ఏమాత్రం అలసత్వం వహించవద్దని జిల్లా పరిషత్ సీఈవో శిరీష ఆదేశించారు. శనివారం నడిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన 'సామాజిక తనిఖీ ప్రజా వేదిక' కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఉపాధి హామీ పనుల అమలులో పారదర్శకత ఉండాలని, నిధుల వినియోగంలో నిబంధనలు పాటించాలని సూచించారు.