VIDEO: షాబాద్‌లో కాలిపోయిన హార్వెస్టర్
RR: షాబాద్ మండలం ఆస్పల్లిగూడ గ్రామంలో హార్వెస్టర్ కాలిపోయిన ఘటన చోటు చేసుకుంది. రైతు శంకర్‌కు చెందిన రూ. 35 లక్షల విలువైన హార్వెస్టర్ పొలం వద్ద పార్క్ చేసి ఉండగా, రాత్రి సమయంలో అకస్మాత్తుగా అగ్నిప్రమాదానికి గురై పూర్తిగా కాలిపోయింది. గత నెలరోజులుగా అక్కడే ఉన్న యంత్రం, అర్ధరాత్రి కాలిపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని బాధితులు తెలిపారు.