ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే
NDL: డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ఇవాళ డోన్‌లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. నీటి సరఫరా, రోడ్లు, పింఛన్లు, విద్యుత్, ఆరోగ్య సదుపాయాలపై ప్రజలు సమస్యలను వివరించారు. ప్రతి వినతిని పరిశీలించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసి చర్యలు తీసుకుంటానని తెలిపారు.