గుర్తుతెలియని జంతువుల దాడిలో దూడె మృతి

గుర్తుతెలియని జంతువుల దాడిలో దూడె మృతి

KNR: తిమ్మాపూర్ మండలం లక్ష్మిదేవిపల్లి గ్రామంలో గంగుల లక్ష్మారెడ్డికి చెందిన దూడెపై గుర్తుతెలియని జంతువులు దాడి చేసి చంపేశాయి. ఈ ఘటనపై ఫారెస్ట్, వెటర్నరీ అధికారులకు సమాచారం అందించినట్లు బాధితుడు శనివారం తెలిపారు. తమ ఇళ్ల దగ్గరికే వచ్చి పశువులపై దాడి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి చేస్తున్న జంతువుల ఆనవాళ్లను గుర్తించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.