Te-Poll మొబైల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి: కలెక్టర్

Te-Poll మొబైల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి: కలెక్టర్

WGL: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు తమ పోలింగ్ కేంద్రం, ఓటర్ స్లిప్ స్టేటస్ వంటి పూర్తి సమాచారం వేగంగా అందేలా రూపొందిన Te-Poll మొబైల్ యాప్ ఇప్పుడు గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ సత్యశారద తెలిపారు. ఒక్క క్లిక్‌తోనే అన్ని వివరాలు తెలుసుకునే సౌలభ్యం కల్పించిన ఈ యాప్‌ను ఓటర్లు తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.