సమస్యాత్మక పోలింగ్ స్టేషన్‌లో భద్రతా సమీక్ష.!
మెదక్ జిల్లా సమస్యాత్మక బూర్గుపల్లి పోలింగ్ స్టేషన్‌లో భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు పరిశీలించారు. బూత్‌లలో పోలీసులు, క్యూలైన్, సీసీటీవీ పర్యవేక్షణను సమీక్షించి, అదనపు బలగాలను మోహరించారు. చిన్నపాటి వివాదాలను వెంటనే నియంత్రించాలని, శాంతి భద్రతలపై విఘాతం కలిగించే చర్యలకు కఠినంగా వ్యవహరించమని సూచించారు.