దారుణం.. ఇద్దరిని కొడవలితో నరికిన వ్యక్తి
వికారాబాద్ పరిధిలోని నాసన్‌పల్లిలో నాగార్జునపై వడ్డే రమేష్ అనే వ్యక్తి కొడవలితో దాడి చేసిన ఘటన తీవ్రంగా కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం నాగార్జునపై రమేష్ కత్తితో తలపై దాడి చేయగా, అక్కడికి వచ్చిన మహిపాల్ ఎందుకు కొడుతున్నావని ప్రశ్నించాడు. దీంతో అతనిపైనా కొడవలితో దాడి చేశాడు. కాగా, ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాలి.