10 కిలోల టమాటాలు రూ. 610
అన్నమయ్య: మదనపల్లెలో టమాటా ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గురువారం మదనపల్లె టమోటా కమిషన్ మార్కెట్‌కు కేవలం 135 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చాయని మార్కెట్ సెక్రటరీ జగదీశ్ తెలిపారు. 10 కిలోల మేలు రకం టమాటాలు రూ. 610, రెండవ రకం రూ.580, మూడవ రకం రూ.500లకు అమ్మకాలు జరిగాయన్నారు. పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోవడంతో టమాటా ధరలు పైపైకి వెళ్తున్నాయని అధికారులు చెప్పారు.