'గ్రామ సభలను విజయవంతం చేయాలి'

SKLM: జలుమూరు మండలంలో శుక్రవారం పంచాయతీల్లో నిర్వహించనున్న గ్రామ సభలను విజయవంతం చేయాలని ఎంపీపీ వాన గోపి పిలుపునిచ్చారు. జలుమూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఎన్ఆర్ఈజీఎస్, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఎంపీపీ మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి అవసరమైన పనులను గుర్తించాలని సూచించారు.