అర్జీలు స్వీకరించిన మంత్రి స్వామి

అర్జీలు స్వీకరించిన మంత్రి స్వామి

ప్రకాశం: టంగుటూరు మండలంలోని తూర్పునాయుడుపాలెంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి ప్రజల నుంచి వినతి పత్రాలు సేకరించారు. వివిధ రకాల పనులపై వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సంబంధిత అధికారులతో ఆయన మాట్లాడారు. త్వరగా సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. కొన్ని సమస్యలను అక్కడకక్కడే పరిష్కరించారు.