వైద్యులకు ఇంటిగ్రేటెడ్ శిక్షణ కార్యక్రమం
ASR: గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్ డీ.కృష్ణమూర్తి నాయక్ వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యాధికారులకు సోమవారం పాడేరులో ప్రత్యేక ఇంటిగ్రేటెడ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మూడు రోజుల పాటు శిక్షణ నిర్వహిస్తామన్నారు.