ఘనంగా అర్బన్ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

ఘనంగా అర్బన్ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

NZB: నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ జన్మదిన వేడుకలను ఆదివారం నగరంలో ఘనంగా నిర్వహించారు. పలు ఆలయాల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయన పేరిట పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యేతో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రేపటి పోలింగ్‌లో అందరూ ఓటేస్తే అదే తనకిచ్చే జన్మదిన బహుమతి అని పేర్కొన్నారు.