కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి
SDPT: గజ్వేల్ మండలంలో విషాద ఘటన జరిగింది. శ్రీగిరిపల్లి గ్రామంలో మార్కుక్ మండలం చేబర్తి గ్రామానికి చెందిన నీరుడి బాబు (35) ప్రజ్ఞాపూర్‌లో మీటర్ రీడర్‌గా పనిచేస్తున్నాడు. ఇవాళ విద్యుత్ లైన్‌కు సంబంధించి మరమ్మతులు చేస్తుండగా కరెంట్ షాక్ తగిలింది. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.