ఆగిపోయిన గొడిసల పల్లి-హీరేహల్ రాకపోకలు
ATP: రాయదుర్గం నియోజకవర్గం డి. హీరేహాల్ మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గొడిశలపల్లి వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో బుధవారం రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. డి. హిరేహాల్ వైపు వెళ్లే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగు ప్రవాహం తగ్గేవరకూ ప్రయాణించొద్దని అధికారులు హెచ్చరించారు.