జిల్లాలో ఆత్మ విజ్ఞాన యాత్ర చేపట్టిన కర్ణాటక రైతులు
ATP: ఆత్మ విజ్ఞాన యాత్ర కార్యక్రమంలో భాగంగా కర్ణాటక రాష్ట్రంలోని రైతులు అనంతపురం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు ఇక్కడ సాగుతున్న పంటల విధివిధానాల గురించి వారికి క్షుణ్ణంగా వివరించారు. అంతర్రాష్ట్ర స్థాయిలో సాంకేతిక పరిగణన మార్పిడి అవసరమని శాస్త్రవేత్తలు రైతులకు వివరించారు.