'విజయాలను చూసి ఓర్వలేక కొత్త నాటకానికి తెరతీసింది'

RR: మూడవసారి ప్రధానమంత్రిగా అధికారంలో ఉన్న మోదీ సాధిస్తున్న విజయాలను చూసి ఓర్వలేక కాంగ్రెస్ ఓట్ల చౌర్యం అంటూ కొత్త నాటకానికి తెరతీసిందని BJP రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి అన్నారు. షాద్‌నగర్‌లో బుధవారం ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీకి రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే ఎన్నికల కమిషన్ అడిగిన ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పలేదని ప్రశ్నించారు.