VIDEO: పిడుగుపాటుకు గురై యువకుడు మృతి

పల్నాడు: దాచేపల్లి మండలం కొత్తూరులో మంగళవారం సాయంత్రం పిడుగు పడి బాణావత్ శివ నాయక్(20) మృతిచెందాడు. శివ నాయక్ పొలం పనులు ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పొలంలోనే చెట్ల వద్ద ఉండటంతో ఒక్కసారిగా పిడుగు పడి అక్కడికక్కడే మరణించాడు.