'క్రీడలలో విద్యార్థులు నైపుణ్యాన్ని సాధించాలి'

MNCL: విద్యార్థులు క్రీడలలో నైపుణ్యాన్ని సాధించాలని జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామ ఈవో రాహుల్ అన్నారు. జన్నారం మండల కేంద్రంలోని బాలికల జడ్పీ పాఠశాలలో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిబిరాలలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి ఆయన వివిధ క్రీడలు ఆడారు. విద్యార్థులు క్రీడలలో నైపుణ్యాన్ని సాధించి మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు.