నేవీ ఉద్యోగి కుటుంబాని ప్రభుత్వం ఆర్థిక సహాయం

VZM: చీపురుపల్లి మండలంలోని పర్ల గ్రామానికి చెందిన ఇండియన్ నేవీ ఉద్యోగి చందక గోవింద కుటుంబానికి ప్రభుత్వం ఐదు లక్షల పరిహారాన్ని మంజూరు చేసింది. 2012లో ఇండియన్ నేవీ దళంలో చేరిన గోవింద్.. తక్కువ సమయంలోనే కమాండో స్థాయికి ఎదిగారు. శిక్షణలో భాగంగా 2023 ఏప్రిల్ 5న కోల్ కత్తాలో పారాచూట్ నుంచి దిగుతూ సరిగా తెరుచుకోకపోవడంతో మృతి చెందారు.